యూపీఐ, రూపే కార్డ్ ల ద్వారా చెల్లిస్తున్న వారికి భారీ షాక్..
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పలు పేమెంట్ గేట్‌వే సర్వీస్ ప్రొవైడర్లు యూపీఐ, రూపే కార్డ్ లావాదేవీలపై చార్జీలు వసూలు చేస్తుండటంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రంగంలోకి దిగింది. చార్జీల వసూలు పై వివరణ ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరింది. యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై వసూలు చేసిన చార్జీలను తిరిగి చెల్లించాలని గతేడాది ఆగస్టులో అన్ని బ్యాంకుల ను సీబీడీటీ ఆదేశించిన విషయం తెలిసిందే.. అయినా కూడా కొన్ని బ్యాంకులు పన్నులను వసూలు చేశారు..
రెండేళ్ల క్రితం డిసెంబర్ లో ఈ విషయం పై పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన కూడా బ్యాంకులు పన్ను వసూలు చేశారు.. అయితే పేమెంట్ సదుపాయం కల్పిస్తున్న వారికి పరిహారం చెల్లించకుండా చార్జీల వసూలుపై నిషేధం విధించటాన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమం లో పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు రిజర్వ్‌బ్యాంకు గత వారం ప్రకటించింది. చిరు వ్యాపారులకు మాత్రమే ఉచితంగా బ్యాంక్ సర్వీసులను అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాది నుంచి ఆ వెసులుబాటును కల్పించింది.. పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసే వాళ్లకు మాత్రం ట్రాన్స్ఫర్ జార్జీలను వేస్తున్నట్లు ప్రకటించారు..తక్కువ మొత్తంలో చేసే లావాదేవీలను చేసే వారికి మాత్రం ఎటువంటి అమౌంట్ కట్ అవ్వదని సంభందిత బ్యాంకులు వెల్లడించాయి.