ఈ స్కీమ్ లో రోజుకు 400 రూపాయలు చెల్లిస్తే చాలు.... 64 లక్షల రూపాయలు గ్యారంటీ...?

Reddy P Rajasekhar
గత కొన్ని నెలల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటును తగ్గించుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు గతంలోలా కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఆర్బీఐ, బ్యాంకులు తీసుకున్న నిర్ణయాల ప్రభావం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పడింది. కేంద్రం సైతం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై గత కొన్ని నెలల నుంచి వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ వస్తోంది.
 
కేంద్రం అందించే దాదాపు అన్ని పథకాల్లో వడ్డీ రేట్లు తగ్గాయి. అయితే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో మాత్రం ఇప్పటికీ ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తోంది. ప్రస్తుతం కేంద్రం ఈ పథకానికి 7.6 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది. అయితే కేవలం ఆడపిల్లలు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హతను కేంద్రం కల్పిస్తోంది.
 
పదేళ్లలోపు వయసు ఆడపిల్లలను ఈ పథకంలో చేర్చవచ్చు. సుకన్య సమృద్ధి అకౌంట్ తెరవాలనుకునే వాళ్లు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఖాతా తెరవాల్సి ఉంటుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు కాగా అకౌంట్ తెరిచిన రోజు నుంచి 14 సంవత్సరాల పాటు డబ్బులను డిపాజిట్ చేయాలి. తర్వాత ఏడు సంవత్సరాలు డిపాజిట్ చేయకపోయినా డబ్బుకు వడ్డీ లభిస్తూనే ఉంటుంది.
 
సంవత్సరానికి గరిష్టంగా లక్షన్నర రూపాయలు సుకన్య సమృద్ధి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రోజుకు 400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 14 సంవత్సరాలలో 37 లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. 14 ఏళ్లలో 37 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్లకు మెచ్యూరిటీ సమయంలో 64 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్లు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు పాక్షిక విత్‌డ్రాయెల్స్‌ సౌకర్యం కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: