లక్షన్నర కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం... ప్రజల అకౌంట్లలోకి నేరుగా జమ..?

Reddy P Rajasekhar

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అతి త్వరలో శుభవార్త చెప్పనున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఉద్ధీపన ప్యాకేజ్ ను ప్రకటించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా దెబ్బకు వృద్ధి రేటు భారీగా తగ్గనుంది. 
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోదీ ప్రభుత్వం అతి త్వరలో లక్షన్నర కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ కేంద్రం ఇప్పటికే ఆర్బీఐతో ప్యాకేజీకి సంబంధించిన చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ఆర్థిక ప్యాకేజీ లక్షన్నర కోట్ల నుంచి రెండున్నర లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
అతి త్వరలో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. ఆర్థిక ప్యాకేజీలోని డబ్బులను 10 కోట్ల మందికి కేంద్రం బదిలీ చేయనుందని తెలుస్తోంది. ఎవరికి బదిలీ చేస్తుందనే విషయానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దేశంలో కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు కూడా ప్రయోజనం కల్పించేలా కేంద్రం చర్యలు చేపడుతోందని తెలుస్తోంది. అతి త్వరలో కేంద్రం నుండి కీలక ప్రకటన రానుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: