మీరు టీవీ చూస్తారా.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..?

Chakravarthi Kalyan
ఇప్పుడు టీవీ మోగని ఇళ్లు చాలా అరుదు. టెక్నాలజీ బాగా పెరిగిపోయి స్మార్ట్ ఫోన్లు వచ్చినా..ఇంకా టీవీకి ఆదరణ తగ్గలేదు. అయితే ఈ టీవీ కనెక్షన్ రేట్లు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ట్రాయ్ మార్చి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి తెస్తోంది.

ఈ ట్రాయ్ కొత్త విధానం ద్వారా నెలకు రూ. 130 నెలకు చెల్లిస్తే 200 ఉచిత చానళ్లు చూడొచ్చు. గతంలో ఇది కేవలం 100 ఉచిత ఛానల్స్‌ ఉండేవి.. 100 దాటిన తరువాత ప్రతి 25 ఛానళ్లకు 25 రూపాయలతో పాటూ జీఎస్‌టీని అదనంగా చెల్లించాల్లి వచ్చేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. నెలకు రూ. 130 కడితే 200 చానల్స్ ఉచితంగా చూడొచ్చు.

అంతే కాదు.. గరిష్టంగా ఒక ఛానల్ ధర రూ. 19 ఉండేది. ఇప్పడు దాన్ని రూ. 12కి తగ్గించారు. ఆ ప్రకారం బొకేలో రూ. 12లోపు ధర ఉన్నవాటినే చేర్చాల్సి ఉంటుంది. అంతే కాదు.. ఒకే ఇంట్లో రెండు కనెక్షన్‌లు ఉంటే రెండో కనెక్షన్‌కు నెట్‌వర్క్ క్యారియర్ ఫీజులో 40 శాతం చార్జీనే వసూలు చేయాలి. ఇదేదో బాగానే ఉంది కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: