మీరు ఉద్యోగం మారుతున్నారా? వెంటనే పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే. పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేస్తున్నారా? చాలా మంది డబ్బులు అవసరమైతే పీఎఫ్ డబ్బులను తీసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) కొన్ని రూల్స్ ఉన్నాయి. వీటి ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు కాంపౌండింగ్ ప్రయోజనం ఇస్తుంది. అలాగే పెన్షన్ ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.
పీఎఫ్ సబ్స్క్రైబర్లు రిటైర్మెంట్ వరకు పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోకపోతే అప్పుడు మాత్రమే వారికి పెన్షన్ లాంటి ప్రయోజనాలు వస్తాయి అని తెలిపింది. అలాగే పీఎఫ్ వడ్డీపై కాంపౌండిగ్ ప్రయోజనం ఇస్తుంది. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ప్రయోజనం కలిగించే ఈపీఎఫ్వో నిబంధనలపై ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజర్ డైరెక్టర్ కార్తిక్ ఝవేరీ వివరాలు తెలుపుతూ.. ఉద్యోగం మారినప్పుడు ఉద్యోగుల సాధారణంగానే పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకుంటారు అని అన్నాడు. ఇలా చేయడం వల్ల పీఎఫ్ ఖాతాదారులు కేవలం డబ్బులు మాత్రమే వెనక్కు తీసుకోవడం లేదని, పీఎఫ్ వడ్డీ కాంపౌండింగ్ ప్రయోజనం కూడా కోల్పోతారని వివరించడం జరిగింది.
పీఎఫ్ ఖాతాదారులు వారి పీఎఫ్ డబ్బులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఝవేరీ తెలియచేయడం జరిగింది. మెచ్యూరిటీ డబ్బులపై ఎలాంటి పన్ను ఉండదని గుర్తు చేశారు. అలాగే సెక్షన్ 80 సీ కింద పీఎఫ్ అకౌంట్లో రూ.1.5 లక్షల ఇన్వెస్ట్మెంట్కు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది అని తెలిపారు. ఈ తరుణంలో పీఎఫ్ డబ్బులను తీసుకొని ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధానాల్లో పెట్టుబడిగా పెడితే ప్రయోజనం పొందొచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వ బాండ్లు, బ్యాంక్ బాండ్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది అని తెలిపారు అధికారులు.