లాభాల బాటలో మహీంద్రా..!

Edari Rama Krishna
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి(క్యూ1) దేశీ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) ఫలితాలు ప్రకటించింది. ముఖ్యంగా ట్రాక్టర్‌, ప్యాసింజర్‌ వాహనాల మద్దతుతో నికర లాభాల్లో 12 శాతం వృద్ధితో రూ.955 కోట్లు ఆర్జించింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 16 శాతం ఎగసి రూ. 962 కోట్లను తాకగా, నిర్వహణ లాభం(ఇబిటా)11 శాతం పెరిగి రూ. 1489 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.850 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది.

క్రితం క్యూ1లో యుటిలిటీ వాహన అమ్మకాలు 13 శాతం పెరిగాయి. ఎగుమతులతో కలుపుకుని 10 శాతం వృద్ధితో 1,10,959 వాహనాలను విక్రయించింది.ఆటో విభాగం మార్జిన్లు 5.9 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది.

కాగా, ప్రస్తుతం బీఎస్‌ఈలో ఎంఅండ్‌ఎం షేరు 2.5 శాతం క్షీణించి రూ. 1445 వద్ద ట్రేడవుతోంది.  గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.10,348 కోట్ల అమ్మకాలు చేశాయి. బుధవారం బిఎస్‌ఇలో ఎంఅండ్‌ఎం సూచీ 2.21 శాతం పెరిగి రూ.1,447.85 వద్ద ముగిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: