
వల్లభనేని వంశీ అరెస్టుపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు?
వంశీ అరెస్టు అక్రమం కాదు. సక్రమమే అన్ని ఆధారాలు ఉన్నాయి.. కేస్ లు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు చెప్పాం.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యక్తిగత భద్రత సిబ్బంది వద్ద బుల్లెట్ బ్యాగ్ మిస్ కావడం దురదృష్టకరం.. ఆయన నిర్లక్ష్యం వల్లనే బుల్లెట్లు తో కూడిన బాగ్ పోయింది.. అయినప్పటికీ ఎంక్వయిరీ జరుగుతుంది... బడ్జెట్ కు సంబంధించి. కేటాయింపు లపై ఆర్ధిక శాఖ కు నివేదికను ఇచ్చాము... పోలీస్ శాఖలో వివిధ కేటాయింపు లపై ఆర్ధిక మంత్రి తో చర్చ జరిగింది... ఇలాంటి సమావేశాలు గత ప్రభుత్వం లో ఎప్పుడు జరగలేదని హోంమంత్రి అనిత అన్నారు.