ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా.! నెక్స్ట్ ఏం జరుగుతుందో..?
ఇరాన్ ఇజ్రాయెల్‌పైన క్షిపణులతో దాడి చేయడమే కాకుండా, ఇజ్రాయెల్ లోపల కూడా కొన్ని బాంబులతో అటాక్ చేయాలని ప్రణాళిక వేసినట్లు ఆ ఏజెన్సీలు బట్టబయలు చేశాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాను దెబ్బతీయాలని ప్లాన్ చేసింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేయబోతుందని వారు తెలిపారు. అలాగే అమెరికా, యూరప్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలకు ముప్పు పొంచి ఉందని, అరేబియాలోని అమెరికా సైనిక స్థావరంపై కూడా దాడి చేయవచ్చని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి.
ఇరాన్ స్లీపర్ సెల్స్, సూసైడ్ బాంబర్లు అమెరికా, యూరప్‌లో దాడులు చేయబోతున్నాయి. ఇరాన్ అనేక దేశాల్లో ఉన్న తన స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేసింది. ఆత్మాహుతి బాంబర్లను కూడా మోహరించారు. ఇజ్రాయెల్‌లోని ఆత్మాహుతి బాంబర్‌లకు VVIP వ్యక్తులను చంపే పనిని అప్పగించారు. అయితే ఇజ్రాయెల్ వెలుపల ఉన్న స్లీపర్ సెల్‌లకు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పేల్చే బాధ్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.