చైనా కి దీపావళి షాక్ ఇచ్చిన మోదీ? ఆ దేశానికి ఎంత నష్టం అంటే..?
అవును... దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నినాదం ఎఫెక్ట్ చైనాపై తీవ్రంగానే పడిందని అంటున్నారు. ఈ ఏడాది దీపావళిని ముఖ్యంగా "మేడ్ ఇన్ ఇండియా" ఎలక్ట్రానిక్స్, డెకరేషన్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా... కన్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కీలక విషయాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా.. దీపావళికి సంబంధించి చైనా వస్తువుల విక్రయాలు భారీగా క్షీణించడంతో సుమారు రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టాన్ని చవిచూస్తోందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్ వాల్ తెలిపారు. ఈసారి కస్టమర్లు ఎక్కువగా స్థానిక ఉత్పత్తులనే కొంటున్నారనే చెప్పారు. ఇదే సమయంలో భారత వ్యాపారం భారీ స్థాయిలో ఉండొచ్చని తెలిపారు!
ఇందులో భాగంగా... భారత వ్యాపారం ఈ 5 రోజుల్లోనే రూ.4.25 లక్షల కోట్ల టర్నోవర్ ను టచ్ చేయొచ్చని అంచనా వేశారు. ఇదే సమయంలో దీపావళి వస్తువులను తయారు చేసే తమ ప్రాంతంలోని మహిళలు, కుమ్మరులు, చేతివృత్తులు, ఇతరులకు సహాయం చేయాలని దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలను సీఏఐటీ కోరింది.