తాత గారి క్లాసిక్ మూవీని వారితో కలిసి ఎంజాయ్ చేసిన నాగ చైతన్య..!
నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగియాఇ. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ‘దేవదాసు” 4K ‘ స్క్రీనింగ్ తో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.
ఈ ఫెస్టివల్ లో భాగంగా అక్కినేని నాగచైతన్య తన తాతగారి క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్(1971) చిత్రాన్ని శాంతి థియేటర్ లో అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా అభిమానుల కోలాహలంతో థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో దేవదాసు(1953), మిస్సమ్మ(1955), మాయాబజార్(1957), భార్యా భర్తలు(1962), డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు(1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం(1981), మనం(2014) సహా ANR ల్యాండ్ మార్క్ మూవీస్ దేశ వ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు.