ఏపీ: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుండే మాక్ టెస్ట్లు.!

FARMANULLA SHAIK
ఏపీ టెట్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ దృష్టిసారించింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే.ఇక ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజుల పాటు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అనంతరం పరీక్షలు ముగిసిన తర్వాత అక్టోబర్‌ 4 నుంచి వరుసగా ప్రైమరీ 'కీ' లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక అక్టోబర్‌ 27వ తేదీన టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. అనంతరం నవంబర్‌ 2వ తేదీన ఏపీ టెట్ 2024 తుది ఫలితాలను ప్రకటిస్తారు.ఈ ఏపీ టెట్ 2024 పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధించినా కూడా ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. కాగా,ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 ప్రకటన చేసింది.
 

ఈ డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈసారి టెట్‌ ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 పరీక్షకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పేపర్‌ 1-ఏకు 1,82,609 మంది, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌-1బీ కు 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులు పేపర్‌ 2-ఏ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది అభ్యర్థులు ఏపీ టెట్  2024 పరీక్షకు అప్లయ్‌ చేసుకున్నారు.ఈ నేపథ్యంలో గురువారం (సెప్టెంబర్‌ 19) నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు.ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుకల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక సెప్టెంబర్‌ 22 నుంచి టెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబరు మూడు నుంచి టెట్‌ పరీక్ష నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. నమూనా క్వశ్చన్‌ పేపర్లను https://cse.ap.gov.inవెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని విజయరామరాజు తెలిపారు. ఏపీ టెట్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని  తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: