అలా చేయండి.. పోలవరంపై చంద్రబాబు కీలక నిర్ణయం..?

Chakravarthi Kalyan
పోలవరం డయాఫ్రం వాల్, ప్రాజెక్టుల నిర్వహణపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు.. డయాఫ్రం వాల్ నిర్మాణం విషయంలో బావర్ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గతంలో డయాఫ్రం వాల్ నిర్మించినప్పటికంటే రెండింతలు పరికరాలు పెట్టి కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలకు సీఎం ఆదేశించారు.

త్వరగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న చంద్రబాబు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు రూ. 300 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రాజెక్టులకు చేయాల్సిన చిన్న చిన్న మరమ్మత్తులకు.. గేట్లల్లో ఏమైనా ఇబ్బందులుంటే రిపేర్లు  చేయడానికి ఆ నిధులను వినియోగించాలన్న చంద్రబాబు.. కృష్ణా-గోదావరి నదులే కాకుండా.. సీమలో పెన్నా-తుంగభద్ర,  ఉత్తరాంధ్రలో వంశాధర-నాగావళి వంటి నదులనూ అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చెరువులు నింపడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: