పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు?

frame పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు?

Chakravarthi Kalyan
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. నాగార్జున సాగర్‌ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 93,615 క్యూసెక్కుల నీరు అఅధికారులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద 3 లక్షల 27వేల క్యూసెక్కులుగా నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద  విద్యుత్ ఉత్పత్తి కోసం పది వేల క్యూసెక్కులు మల్లిస్తున్నామని అధికారులు తెలిపారు.

పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 26.79 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్ గేట్లు పూర్తిగా ఎత్తడంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. వచ్చే వరదను బట్టి మరికొన్ని గేట్లు ఎత్తేందుకు పులిచింతల ప్రాజెక్టు అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More