చంద్రబాబా మజాకా.. భలే రికార్డు కొట్టేశారే?

Chakravarthi Kalyan
చంద్రబాబు మరోసారి రికార్డు కొట్టేశారు. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ చేసి కొత్త చరిత్ర సృష్టించారు. ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు సర్కారు.. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్య్రమాన్ని చేపట్టింది. నిన్న సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసేసిన చంద్రబాబు సర్కారు కొత్త రికార్డులు నెలకొల్పింది.
నిన్న రాత్రి 7 గంటల సమయానికి 61,60,825 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. 4,159 కోట్ల రూపాయల పెన్షన్ మొత్తం లబ్ధిదారులకు అందజేశారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పెన్షన్ పంపిణీ.. ఇప్పుడు దాదాపు ఒక్క రోజులోనే  పూర్తయింది. 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగుల తో రికార్డు స్థాయిలో 12 గంటల వ్యవధి లో పెన్షన్లు పంపిణీ చేసేశారు. గత ప్రభుత్వ హయంలో 2.65 మంది వాలంటీర్ లు ఉన్నా ఒక్క రోజులో  కేవలం 88 శాతం మాత్రమే పంపిణీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: