భలే సెటైర్: N D A అంటే.. నేషనల్ డిజాస్టర్ అలయెన్స్?
నీట్ - యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువైనా మోదీ ప్రభుత్వం జూలై ఆరో తేదీ నుంచి కౌన్సిలింగ్ కొనసాగిస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎలాంటి నిర్ధిష్ట కారణాలు చూపకుండా నీట్ - పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారన్న మంత్రి కేటీఆర్.. ఈ నిర్ణయాల వెనక ఉన్న లాజిక్ ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందన్న మంత్రి కేటీఆర్.. అన్నింటికీ కారణం నేషనల్ డిజాస్టర్ అలయన్స్ కారణమని ఎద్దేవా చేశారు.