నెత్తురు పారుతున్నా.. కేసీఆర్‌ పట్టించుకోలేదు.. రేవంత్‌ మీరూ అంతేనా?

Chakravarthi Kalyan
గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఈ విషయంలో గిరిజనులకు అధికారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నా సమస్య తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోడు భూముల మీద పారెస్ట్ అధికారుల దాష్టికాలు, దాడులు ఎక్కువయ్యాయని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ విమర్శించారు.

అధికారులు పోడు భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారని.. పోడు భూములన్ని రణ రంగాన్ని తలపిస్తున్నాయని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ వాపోయారు. కేసీఆర్ సర్కారు పోడు భూములకు పది శాతం కూడా పరిష్కారం చూపలేదని.. ప్రభుత్వం భూములు లాక్కుంటే పోడు రైతులు ఎక్కడికి పోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ప్రశ్నించారు. 30-40 సంవత్సరాలుగా పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకోవడం దారుణమన్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్.. రైతు నుంచి రైతు కూలీగా మార్చి జీవన ప్రమాణాలను తగ్గిస్తున్నారన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా భూములు స్వాధీనం చేసుకోవడం సరైంది కాదని.. పోడు రైతులకు భాజపా అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హైదారాబాద్ లో పోడు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్.. రేవంత్ రెడ్డి అయినా ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: