జగన్, బాబు, పవన్.. ముగ్గురిలో జగన్ లెక్కలే పర్ఫెక్ట్.. ఎందుకంటే?
రాష్ట్ర వ్యాప్తంగా జరగిని పోలింగ్ సరళిని గమనించి బూత్ ల వారీగా డేటాను తెప్పించుకొని దీనిపై సమీక్షలు జరిపారు. లెక్కలు వేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో 80-90 శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఓసీలు ఎక్కువగా ఉండే పోలింగ్ బూత్ ల్లో 75-85 శాతం వరకు ఓట్లేశారు. ఇక్కడ కులాల వారీగా మహిళలు ఎంత మంది ఉన్నారు. తమకు లాభించే అవకాశాలు ఏంటి? మహిళలు, వృద్ధులు వైసీపీకే ఓటు వేశారా వంటి అంశాలను నిర్ధారించుకొని సీఎం జగన్ ఐ ప్యాక్ ఆఫీస్ కు వచ్చి దేశం నివ్వెరపోయేలా ఫలితాలు ఉంటాయని ప్రకటించారు. మరి ఇవి నిజం అవుతాయా లేదా అంటే వెయిట్ అండ్ సీ.