సింగర్ మంగ్లీ కి మరో షాక్.. ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఫిర్యాదు..!
మైక్రో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో భారీగా నిధులను వసూలు చేసి బాధితులకు అన్యాయం చేసిన వారితో మంగ్లీకి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాధితులు ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈమె పైన అధికారికంగా కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై సింగర్ మంగ్లీ పాత్ర ఉందా లేదా అనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ కేవలం పోలీస్ స్టేషన్ కి పరిమితం కాకుండా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వర్గాలను ప్రకంపనలు సృష్టిస్తోంది.
తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ ఈ విషయం పైన చాలా ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. నిరుపేదల దగ్గర నుండి సొమ్ము వసూలు చేసిన విషయంలో ఆ బాధితులకు తగిన న్యాయం జరిగే వరకూ మంగ్లీని వదిలి పెట్టకూడదంటూ ఆయన డిమాండ్ చేశారు. అంతవరకు ఆమెను ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించాలంటూ పేర్కొన్నారు. సంపత్ నాయక్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మంగ్లీ పైన చర్యలు తీసుకోవాలంటు ప్రొడ్యూసర్ కౌన్సిలర్ కు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం సరైనది కాదని బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకూ ఆమెను సినిమాల నుంచి పక్కన పెట్టాలంటూ ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.