ఏపీ రాజకీయాలలో ఊహించని రేర్ సిన్స్

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిరంతరం ఏదో ఒక ఆసక్తికరమైన పరిణామాలు చేసుకుంటున్నాయి. సాధారణంగా పరస్పర విమర్శలు చేసుకొనే అధికార పార్టీలు, విపక్ష నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా మాత్రం శుభాకాంక్షలు, పరామర్శలు తెలుపుతూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా ఏపీలో ఒక ఆసక్తికరమైన చోటు చేసుకుంది..ఒకవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ఆరోగ్య, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తున్నానంటూ తెలియజేశారు.


సాధారణంగా రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఈ శుభాకాంక్షలు తెలియజేయడం ఇప్పుడు రాజకీయాలలో మరో చర్చకు దారితీసింది. అలాగే మరొకవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పైన స్పందిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఒక ట్విట్ చేశారు. అయితే రాజకీయంగా విభిన్న ధోరలు ఉన్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యం పైన పరామర్శించడం మాత్రం ఇప్పుడు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు అభిమానులు నేతలు.


ఇటీవల కాలంలో రాజకీయాలలో పదునైన విమర్శలు ఆరోపణలు పెరుగుతున్న సమయంలో ఇటువంటి ట్వీట్లు ఇప్పుడు రాజకీయాలలో సరికొత్తగా కనిపిస్తున్నాయి. విభేదాలు వ్యక్తిగత అంశాలలో పరస్పరం గౌరవించుకోవడం రాజకీయాలలో చాలా అరుదుగా కనిపిస్తుందని విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సీన్స్ చాలా అరుదుగా వస్తాయని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పనికి సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన ఈ ట్వీట్లు ఇప్పుడు రాజకీయాలలో మరో సరికొత్త కోణాన్ని చూపిస్తున్నాయని చెప్పవచ్చు.



ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి, జనసేన ,బిజెపి పార్టీలు 2024 ఎన్నికలలో భారీ ఘన విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ అన్ని విధాలుగా ఏపీని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఇచ్చిన హామీలను సైతం ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: