టీడీపీ భయపెట్టింది.. వైసీపీ అడ్డుకోలేకపోయింది?

Chakravarthi Kalyan
ఎన్నికలకు ముందు టీడీపీ ల్యాండ్‌ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టింది. టీడీపీ పోలింగ్‌కు ముందు మూడు రోజుల ముందు నుంచి మీ భూములు మీకు కావాలంటే.. టీడీపీకి ఓటేయ్యాలి అని ప్రకటనలు ఇచ్చి ఏపీ ఓటర్లను ఆలోచనలో పడేసింది. ఇది ఓరకంగా వైసీపీని ఇరుకున పెట్టింది. దీని గురించి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా.. మధ్య తరగతి, చిన్న సన్నకారు రైతుల్లో ఆందోళన మొదలైంది.
ఎందుకంటే భూములకు సంబంధించిన వ్యవహారం అత్యంత సున్నితమైంది. దీని మీదనే గ్రామీణ ప్రాంత ప్రజలు ఆధారపడి ఉంటారు. ఈ చట్టం వల్ల లాభ నష్టాల గురించి వాళ్లు చర్చించుకొనే ఉంటారు. అందులో సందేహం లేదు. అయితే ఎంతమంది దీనికి భయపడి ఓటేశారు అనేది మాత్రం ఎన్నికల తర్వాతే తేలుతుంది. వాస్తవానికి చాలా చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్టే అని ఆ ప్రాంత ప్రజలు నమ్మితే మాత్రం వైసీపీకి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. మరి ఏం జరిగిందో అనేది ఎన్నికల తర్వాత తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: