కూటమి: ఆ దిక్కుమాలిన ఐడియా ప్రశాంత్‌ కిషోర్‌దేనా?

Chakravarthi Kalyan
ఈ ఎన్నికల ప్రచారంలో ఆఖరి రెండు వారాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశాన్ని టీడీపీ తీసుకుంది. అయితే ఇది ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వైసీపీ ఘన విజయం సాధించడానికి కారణమైన నవరత్నాల్లో తానే కీలకంగా వ్యవహరించానని ప్రశాంత్ కిశోర్ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇప్పుడు కూడా టీడీపీకి బూస్ట్ ఇచ్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాడని పలువురు పేర్కొంటున్నారు. తక్కువ సమయంలో ప్రజల్లోకి వెళ్లాలంటే అది ప్రతి ఒక్కరికి సంబంధించి అయి ఉండాలి. అందుకే ఈ చట్టాన్ని ఎంపిక చేసుకొని వారిలో ఓ రకమైన భయాన్ని సృష్టించగలిగారు. పేపర్లలో యాడ్ లు కూడా రెండు, మూడు రోజుల ముందు నుంచి మీ భూములు మీకు కావాలంటే టీడీపీకి ఓటేయ్యండి అని ఉంది.  మిగతా అంశాలు సూపర్ సిక్స్, రూ.4వేల పింఛన్ వంటి వాటిని టచ్ చేయకుండా ఈ యాడ్ లను రూపొందించారు. మరి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన వ్యూహం గట్టెక్కిస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: