సద్గురుకు బ్రెయిన్‌ సర్జరీ.. ఫోన్‌ చేసిన మోడీ?

Chakravarthi Kalyan
ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ గురించి తెలియని వారు చాలా అరుదు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆకట్టుకుంటాయి. ఆనందం గా జీవించడంపై ఆయన ఉపన్యాసాలిస్తుంటారు. అయితే ఆయన తాజాగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు ఈనెల 17న బ్రెయిన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్టు దిల్లీ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఈ శస్త్రచికిత్స వివరాలను సద్గురుకు ఆపరేషన్‌ చేసిన న్యూరాలజిస్ట్‌ వినిత్‌ సూరి సోషల్ మీడియా ద్వారా చెప్పారు. గత నాలుగు వారాలుగా సద్గురు తలనొప్పితో బాధపడుతున్నారని.. అయినా ఆయన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని  వినిత్‌ సూరి తెలిపారు. అయితే మార్చి 15 తర్వాత తలనొప్పి మరింత తీవ్రమైందని.. ఆదివారం ఉదయం ఆసుపత్రికి వచ్చారన.. స్వామీజీకి  వైద్యపరీక్షలు నిర్వహించి మెదడులో రక్తస్రావం జరిగిందని గుర్తించామని  వినిత్‌ సూరి తెలిపారు. తమ వైద్య బృందం వెంటనే శస్త్ర చికిత్స చేసిందని.. ఊహించిన దానికంటే త్వరగా కోలుకుంటున్నారని  వినిత్‌ సూరి వివరించారు. ఆపరేషన్ తర్వాత ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న జగ్గీ వాసుదేవ్‌ను ప్రధాని మోదీ ఫోన్‌ ద్వారా పరామర్శించారు. జగ్గీవాసుదేవ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: