జగన్‌ ఓటమికి తనవంతుగా నిమ్మగడ్డ పోరాటం?

Chakravarthi Kalyan
మాజీ ఎన్నికల ప్రధాన అధికారి  నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తున్నారా.. ఆయన కమిషనర్‌గా ఉన్నప్పుడు జగన్ కూ ఆయన మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అయితే రిటైరైన తర్వాత కూడా ఆయన పరోక్షంగా జగన్ ఓటమి కోసం ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల అవగాహన కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలు కావడం లేదంటున్నారు.

ఎన్నికల నియమావళి అమలైన తరువాత కటౌట్లు తీసివేయాలని.. ఈ కటౌట్ లను రాజకీయ ఖర్చులు కింద పరిగణించాలి ఇది నిబంధన అని.. రాష్ట్రంలో ఎన్నికల నియమాలని అమలు చేయడంలో వైఫల్యాలకు ఇది నిదర్శనమని నిమ్మగడ్డ రమేష్ కుమార్  అంటున్నారు. రేషన్ వాహనాలపై, ధ్రువీకరణ పత్రాల మీద, పిల్లల స్కూల్ బ్యాగ్ మీద ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉన్నాయంటున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. పంట పొలాల్లో వేసే రాళ్లపైనా  చిత్రాలు ఉన్నాయని.. వీటన్నింటినీ ఎలా సవరిస్తారు ఎవరికీ అర్థం కాని విషయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనట్లు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాష్ట్రంలో ఎన్నికల నియామావళి అమలవుతుందన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా అధికారులు స్వతంత్రంగా ధైర్యంగా  ఇప్పుడైనా వ్యవహరించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: