దిల్లీ: 20 ఎకరాల ఏపీ భవన్‌.. 2 రాష్ట్రాలకు ఇలా పంచేశారు?

Chakravarthi Kalyan
దిల్లీలోని ఎకరా రూ.501 కోట్ల విలువ చేసే 19.781 ఎకరాల ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ భూమి పంపకం సాఫీగా జరిగిపోయింది. ఈ భూమిని కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణకు 58.32%, 41.68% నిష్పత్తిలో పంచేసింది. మొత్తం రూ.9,913.50 కోట్ల విలువైన ఈ భూమిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.5,781.41 కోట్ల విలువైన 11.536 ఎకరాలు దక్కాయి. అలాగే తెలంగాణకు రూ.4,132.08 కోట్ల విలువైన 8.245 ఎకరాలు వచ్చాయి. విభజన చట్టంలో చెప్పిన సూత్రాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన విధానం ప్రకారం ఈ పంపకం జరిగింది. కేంద్ర హోంశాఖ ఈ భూమిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. మొత్తానికి రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఈ ఆస్తి వివాదం పరిష్కారమైంది.

మార్చి 11న జరిగిన ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశంలో రెండు ప్రభుత్వాలూ అంగీకరించిన ఆప్షన్‌-జి ప్రకారం భవన్‌ ఆస్తులను విభజించారు. ఏపీ భవన్‌లో అశోకరోడ్డు చివరలో ఉన్న గేట్‌ను భద్రతా కారణాల రీత్యా మూసేస్తారు. భవన్‌ స్థలంలో ఇంకా 0.043 ఎకరాల్లో ఆక్రమణలున్నాయి. వాటిని తొలగించలేకపోతే ఆ మేరకు భూమిని ఇరు రాష్ట్రాలు జనాభా నిష్పత్తిలో వదులుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: