అసలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఏమైంది?

Chakravarthi Kalyan
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీఆర్ఎస్‌తో పొత్తును ప్రకటించారు. ఆ తర్వాత ఆ పొత్తు కూడా వివాదాస్పదం అయ్యింది. దీంతో ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికే రాజీనామా చేశారు. అంతే కాదు.. మాజీ సీఎం కేసీఆర్‌తో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భేటీ అయ్యారు. కొత్తదారి ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు.

పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తానంటున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. నాకు రాజీనామా తప్పా మరో మార్గం కనిపించలేదని.. బరువైన గుండెతో బీఎస్పీకి రాజీనామా చేస్తున్నానని.. ఇటీవలి నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టంకలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు. నన్ను నమ్మి నాతో నడిచిన స్వేరోలను మోసం చేయలేనన్న  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. భారాస, బీఎస్పీ పొత్తు లేకుండా భాజపా ఒత్తిడి తీసుకొచ్చిందన్నారు. తాను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనని.. అందరితో చర్చించాక భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని.. భవిష్యత్‌లో కేసీఆర్, బీఆర్ఎస్‌తో కలిసి నడుస్తానని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rsp

సంబంధిత వార్తలు: