కేసీఆర్‌ బూతులు కమ్మన.. రేవంత్‌ తిట్లు కారం?

Chakravarthi Kalyan
తెలంగాణలో కొన్ని చోట్ల నీరు లేక పంటలు ఎండుతున్నాయి. అయితే ఎస్సారెస్పీలో నీటి కొరతకు కేసీఆర్‌దే నైతిక బాధ్యతని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. వర్షాకాలంలో మేడిగడ్డ నీటిని ఎస్సారెస్పీకి కేసీఆర్ సర్కారు తరలించలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. మిషన్ భగీరథ టెక్నికల్‌ ఆఫీసర్‌ను ఉరితీయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. పవర్‌ ప్లాంట్‌ పై జ్యుడిషియల్‌ దర్యాప్తు వేయడంతో కేసీఆర్‌కు భయం మొదలైందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50శాతం రిజర్వేషన్‌ల సీలింగ్‌ను తొలగిస్తామని వెల్లడించారు.


బీఆర్‌ఎస్‌ నేతలకు ఇన్ని రోజులు కేసీఆర్‌ బూతులు మాట్లాడితే వినసొంపుగా ఉండి.. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే చెవిలో సీసం పోసినట్లుగా ఉందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ బయట పెట్టడానికి బీజేపీ ఎందుకు భయపడుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: