ఆ పోలీస్‌ నోరు విప్పితే.. కేసీఆర్‌ ఔట్‌?

Chakravarthi Kalyan
ఎస్‌ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కాల్‌ ట్యాపింగ్ ఆరోపణల వ్యవహారం సంచలంగా మారింది. ఆయన కేసీఆర్ గూఢచారిగా విమర్శలు వస్తున్నాయి. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే అరెస్టు చేశారని.. ఆయన్ను సీక్రెట్‌ ప్రాంతంలో విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కాల్ ట్యాపింగ్,  రికార్డులు ధ్వంసం  కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్‌ఐబి అదనపు ఎస్పీ రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తుకు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. జూబ్లిహిల్స్ ఎసిపి వెంటకగిరి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. ఐదుగురు సభ్యులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారని.. అందులో జూబ్లిహిల్స్ ఎసిపి, బంజారాహిల్స్ ఇన్పెక్టర్, పంజాగుట్ట ఇన్పెక్టర్  సహా మరో ఇద్దరు అధికారులు ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: