ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రా.. అంతా మన ఖర్మ?

Chakravarthi Kalyan
అసలు తెలంగాణ సోయిలేనివ్యక్తి సీఎం కావడం మన ఖర్మ అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్‌.రేవంత్‌కు తెలంగాణ ఆత్మ లేదని.. రేవంత్‌కు తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని  కేటీఆర్‌ అంటున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ సాక్షిగా రేవంత్ దాడి చేశారన్న కేటీఆర్‌.. గోల్‌మాల్ గుజరాత్ మోడల్‌కు గోల్డెన్ తెలంగాణ మోడల్‌కు పోలికేంటని ప్రశ్నించారు. మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నచ్చిందా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

నిన్నటి దాకా... గుజరాత్ మోడల్ పై రేవంత్‌ నిప్పులు చెరిగారని.. ఇప్పుడు ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెబుతారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇదేం నీతి... ఇదేం రీతి.. దేశం మెచ్చిన తెలంగాణ నమూనాను కించపరుస్తారా.. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతారా అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. నాడు ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి రైఫిల్ ఎత్తారని.. ఇప్పుడు ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారని ఆయన్ను చరిత్ర క్షమించదని కేటీఆర్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: