కొత్త కండీషన్‌: స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు?

Chakravarthi Kalyan
ఇందిరమ్మ ఇల్ల పథకంలో తొలివిడతలో స్థలం ఉన్న వారికే నిర్మాణం కోసం అయిదు లక్షల రూపాయలు కేటాయించనున్నారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మహిళల పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ఇందిరమ్మ పథకంలో నిర్మించే ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు ఉండాలని.. అందులో హాలు, బెడ్ రూం, వంట గది, బాత్ రూం తప్పనిసరిగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ప్రజాపాలన దరఖాస్తులు, తెల్లరేషన్ కార్డు ఈనెల 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. మొదటి విడతలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3 వేల 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెంటనే మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. పేదలకు నీడ కల్పించడం ప్రభుత్వాల కర్తవ్యమని గత పాలకులు విస్మరించారని  ప్రజల ఆశలను రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని మంత్రి పొంగులేటి  విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: