ఏపీ జర్నలిస్టులకు జగన్ గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
ఏపీ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరానికి పొడిగించింది. ఈ మేరకు జీవో యం.యస్ నెం. 48 ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే 31.03.2023న జీవో నంబర్ 38 జారీ చేసిన విషయం గుర్తుచేస్తూ కొత్తగా అక్రిడిటేషన్ కార్డును పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రీమియం పైకం రూ.1,250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి 31.03.2024 వరకు లబ్ధి పొందవలసిందిగా  కమిషనర్ సూచించారు.


ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ జిరాక్సు కాపీలను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని రెండవ ఫ్లోర్ లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ, కమిషనర్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా కమిషనర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: