గొర్రెల కేసులో కీలక సమాచారం.. పెద్దల అరెస్టులు?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ హయాంలో ఘనంగా చెప్పుకున్న గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగాయని ఇటీవల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ  కేసు నిందితుల ఏసీబీ మూడు రోజుల కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరపరిచారు. అనంతరం చంచల్‌గూడా జైలుకి అధికారులు తరలించారు. విచారణలో నలుగురి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కీలకమైన సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. రైతులకు ఇవ్వవలసిన 2.10 కోట్లు నగదును 10 మంది బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించారని అధికారులు గుర్తించారు.
ప్రధాన నిందితుడు బినామీల బ్యాంక్ ఖాతాలను తన వ్యక్తిగత ఖాతాలకు నగదును బదిలీ చేసుకున్నాడని అధికారులు తేల్చారు. ఈకేసులో మరికొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా ఉందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జల్లా చెందిన పశుసంవర్ధక శాఖలో కొందరు అధికారులను బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చారు. అందులో ఇద్దరి అధికారులను మరోసారి విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: