ఏపీలో టీడీపీదే అధికారం.. ఇదే బలమైన సంకేతం?

Chakravarthi Kalyan
ఏపీలో రాజకీయ సమరం భీకరంగా సాగుతోంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్నది సామాన్యుల చర్చల్లోనూ సాగుతోంది. అయితే.. ఎన్నికల ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. రాజకీయంగా ఏ పార్టీ బలంగా ఉంటే.. ఆ పార్టీలో చేరేందుకు నేతలు ఉత్సాహం చూపిస్తుంటారు. రాజకీయంగా ఎన్నికల సమయంలో జంపింగ్‌లు సాధారణమే. అయితే.. గాలి ఉన్న పార్టీలోకే చేరికలు ఉంటుంటాయి.
ఈ దఫా ఆ కోణంలో చూస్తే టీడీపీకే గాలి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. సాధారణంగా అధికార పార్టీలోకే చేరికలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే.. విపక్షం బలంగా ఉండి.. అధికారం మారుతుందని అనిపిస్తే విపక్షంలోకి చేరికలు బాగా ఉంటాయి. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. ఇటీవల తెలంగాణలోనూ ఇవే సంకేతాలు కనిపించాయి. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు కనిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: