చంద్రబాబు తర్వాత తానే సీఎం అంటున్న పవన్‌?

Chakravarthi Kalyan
టీడీపీ గెలిస్తే ఏపీకి చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు. అందులో సందేహం లేదు. కానీ.. మరి చంద్రబాబు తర్వాత ఎవరు సీఎం అవుతారు.. ఇంకెవరు నేనే అంటున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఆ మాట నేరుగా చెప్పకపోయినా.. నిన్నటి తాడేపల్లిగూడెం సభ ద్వారా ఆ విషయం చెప్పకనే చెప్పారు.
చంద్రబాబును పొగుడుతూనే తాను పాతికేళ్ల సుదీర్ఘ భవిష్యత్‌ కోసం పార్టీ పెట్టానని చెప్పడం ద్వారా చంద్రబాబు తర్వాత తానే సీఎం అవుతానంటూ సంకేతాలు ఇచ్చారు. అంటే బహుశా ఆయన 2029 నాటికి సీఎం అవుదామని కలలు కంటున్నారేమో అనిపిస్తోంది. సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇద్దాం మంటున్న పవన్‌ కల్యాణ్‌.. అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారన్నారు. పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదని.. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉందని.. మన విజయానికి స్ఫూర్తి జెండా.. అందుకే జెండా పేరుతో సభ పెట్టామని పవన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: