రంకెలు వేసిన పవన్‌.. పదేళ్లు ఏంచేశారో?

Chakravarthi Kalyan
తాడేపల్లి గూడెం టీడీపీ జనసేన సభలో పవన్‌ కల్యాణ్‌ జగన్‌ పై రంకెలు వేశారు. జగన్ ను అధపాతాళానికి తొక్కుతానన్నారు. జగన్‌కు తాను యుద్ధం అంటే ఏంటో రుచి చూపిస్తానన్నారు. వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తాన్నన్నారు. పవన్ కల్యాణ్‌ ఆవేశంతో డైలాగుల్లా పంచ్‌లు పేలుస్తుంటే జనసైనికులు ఖుషీ అయ్యారు.
బావుంది.. చాలా బావుంది.. కానీ పవన్‌ కల్యాణ్‌  పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి సభలోనూ ఇలాగే ఆవేశంగా మాట్లాడుతున్నారు. కానీ.. ఆయన సాధించింది ఏంటి అని చూస్తే మాత్రం పూర్తి నిరాశాజనకంగానే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్‌ బతుకు నాకు తెలుసన్నారు పవన్ కల్యాణ్‌.. జగన్‌.. ఇప్పటి వరకు పవన్‌ తాలూకా శాంతినే చూశావు.. జగన్‌.. ఇకపై నా యుద్ధం ఏంటో చూస్తావు అంటున్న పవన్‌.. మరి ఆ యుద్ధం నిజంగా ఎప్పుడు చూపిస్తారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: