కాళేశ్వరంపై రేవంత్‌ రెడ్డే కుట్ర చేస్తున్నారా?

Chakravarthi Kalyan
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక.. పాత సర్కారు అవినీతి మొత్తాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దృష్టి పెట్టారు. అలాగే మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలను హైలెట్ చేస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించారు. అయితే.. సీఎం తీరు చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తుందని కేటీఆర్‌ విమర్శించడం సంచలనం కలిగిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలూ కొట్టుకుపోవాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్న కేటీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వమే కుట్ర చేస్తుందని భావిస్తున్నానన్నారు.

కాళేశ్వరానికి మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టు కొట్టుకుపోయేలా చేసే ఆలోచనలో ఉన్నారని కేటీఆర్‌ చెప్పడం విశేషం. క్షుద్ర రాజకీయాల కోసం మేడిగడ్డను బలి చేయవద్దన్న కేటీఆర్‌..  మాపై కక్షతో నీళ్లు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం మాని పరిష్కారం చూపాలని.. వానాకాలం రాకముందే మేడిగడ్డపై మేల్కోవాలని.. కాళేశ్వరంపై కాలయాపన చేయకుండా పరిష్కారం చూపండని కేటీఆర్‌ అంటున్నారు. కనీసం ఒక పంప్‌ అయినా నడిపించి రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: