గంటాను చంద్రబాబు చెడామడా తిట్టేశారా?

Chakravarthi Kalyan
టీడీపీ అసెంబ్లీ టికెట్ల వ్యవహారం అనేక వివాదాలకు దారి తీస్తోంది. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. అయితే.. చంద్రబాబు గంటాను చీపురుపల్లిలో పోటీ చేయమని సూచించారని.. అందుకు గంటా సుముఖంగా లేరని.. దీంతో చంద్రబాబు ఆయన్ను తిట్టారని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై గంటా స్పందించారు. తొలి జాబితాలో పేరు లేకుంటే సీనియర్లను అవమానించినట్లు కాదన్న గంటా.. పొత్తుల వల్ల సీట్లు దక్కని వారికి పార్టీ న్యాయం చేస్తుందన్నారు. 

చంద్రబాబు నన్ను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్న గంటా శ్రీనివాసరావు.. నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానన్నారు. వైకాపా లో ఇమడలేక చాలా మంది ఆ పార్టీని వీడుతున్నారన్న గంటా శ్రీనివాసరావు.. సీట్ల సర్దుబాటు తెదేపా - జనసేన అంతర్గత వ్యవహరమన్నారు. 70 మందిని ప్రకటించడానికి వైకాపా ఏడు జాబితాలు విడుదల చేసిందన్న గంటా శ్రీనివాసరావు.. వైకాపా ప్రకటించిన 70మందీ అభ్యర్థులు కాదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: