ప్రశ్నలు: 24 సీట్లతో రాజ్యాధికారం ఎలా పవన్‌?

Chakravarthi Kalyan
టీడీపీతో జనసేన పొత్తుల లెక్కలు ఖరారయ్యాయి. అయితే.. 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం తెస్తాడని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైందని.. ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారంటూ మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడన్న మాజీ మంత్రి పేర్ని నాని.. 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం ఎలా తెస్తాడన్నారు.
పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెత గుర్తొస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్ చేస్తారన్న మాజీ మంత్రి పేర్ని నాని..  జనసేన, టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలని.. చంద్రబాబు, పవన్ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: