ఏపీ ఆస్పత్రిని జాతికి అంకితం చేయనున్న మోదీ?

Chakravarthi Kalyan
ఇవాళ మంగళగిరిలోని ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. రాజ్ కోట్ నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఎయిమ్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ పాల్గోనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతీ ప్రవీణ్ పవార్, రాష్ట్ర మంత్రి విడడల రజని కూడా హాజరవుతారు.

మొత్తం రూ. 1618 కోట్ల వ్యయంతో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి అయ్యింది. 960 పడకలు, 125 సీట్లతో బోధనాసుపత్రిగా ఎయిమ్స్ రూపొందింది. వీటితో పాటు విశాఖలో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: