గొర్రెల కేసు.. కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తుందా?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై రేవంత్ సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా గొర్రెల పంపిణీ కేసును విచారణ జరిపిస్తోంది.
 తాజాగా ఇందులో  ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
రవి, ఆదిత్య, రఘుపతిరెడ్డి, గణేష్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. వారిని రిమాండ్‌కు తరలించారు. వీరంతా పశుసంవర్థక శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ వీరిలో ఉన్నారు. 133 గొర్రెల యూనిట్లకు సంబంధించి రూ.2.10కోట్లు మళ్లింపు రైతుల ఖాతాల్లోకి బదులు బినామీ ఖాతాలకు వీరు మళ్లించినట్టు గుర్తించారు. ప్రస్తుతం నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన అధికారులు.. ముందు ముందు పెద్ద తలకాయలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: