కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే.. కోమటిరెడ్డి వార్నింగ్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. కాంగ్రెస్‌ను టచ్ చేస్తే భాజపాను నామరూపాలు లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ కిషన్ రెడ్డి మాట్లాడటంపై ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే భాజపాను నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మాదిరిగా పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చడం పోరాటాల గడ్డ తెలంగాణలో సాధ్య కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఒక్క పైసా తీసుకురాలేని కిషన్ రెడ్డి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల కోసం భాజపా, భారాస లోపాయికారీ ఒప్పందం పెట్టుకుంటున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: