చంద్రబాబు, లోకేశ్‌ మధ్య ఆ విషయంలో వార్‌?

Chakravarthi Kalyan
టీడీపీలో చంద్రబాబు, లోకేశ్‌ మధ్యవార్‌ నడుస్తోందంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు రెస్టు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని నారా భువనేశ్వరి కుప్పం సభలో అనడాన్ని వైసీపీ నేతలు అడ్వాంటేజీగా తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు నారమల్లి పద్మజ దీనిపై స్పందించారు. సుదీర్ఘకాలం కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఇక పనికిరాడని స్వయంగా ఆయన భార్యే చెబుతోందని నారమల్లి పద్మజ అన్నారు. అందుకే అందరిలోనూ ఓ ప్రశ్న ఉత్పన్నమౌతోందని.. చంద్రబాబు ఎమ్మెల్యేగానే పనికిరాడా.. లేదంటే, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడా అని సందేహాలు వస్తున్నాయని నారమల్లి పద్మజ అన్నారు.

అసలు భువనేశ్వరి మాటల అంతరార్థం చూస్తే.. ఆమె ఇవన్నీ నిజంగానే చెబుతుందా.. లేదా తండ్రి ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటుకు బదులుగా చెబుతోందా అన్న అనుమానం వస్తోందంటున్నారు నారమల్లి పద్మజ. ఒకవేళ లోకేశ్‌ బాబే తన తల్లి చేత ఇలా మాట్లాడిస్తున్నాడా అని కూడా అంటున్నారు. మా నాన్న పని అయిపోయిందని.. నేటి రాజకీయాలకు ఆయనెటూ పనికిరాడని.. ఎలాగైనా మూలన కూర్చోబెట్టాలని తల్లికి చెప్పాడా అన్న విషయం కూడా తేలాలని నారమల్లి పద్మజ  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: