బీజేపీ-బీఆర్ఎస్ పొత్తులు.. నిజమా.. డ్రామానా?

Chakravarthi Kalyan
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని రెండు పార్టీలు కొట్టిపారేస్తున్నా.. ఊహాగానాలు మాత్రం జోరుగానే వస్తున్నాయి. ఈ రెండు పార్టీల పొత్తు నాటకాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటున్నారు కాంగ్రెస్ నేతలు.. ఇవి ఇప్పుడు పొత్తు కొత్తగా పెట్టుకోవడం ఏంటి ? ఎప్పట్నుంటో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉన్నదని.. కేసీఆర్ చెప్పాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసిందంటున్నారు కాంగ్రెస్ నేతలు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించడానికి కుట్రలు చేసి ఇదే బీజేపీ.. బీఆర్ఎస్ కి తోక పార్టీగా పని చేసిందన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసంటున్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ - బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న, పెట్టుకోకపోయినా ఈ రెండు పార్టీలు తోడు దొంగలని తెలంగాణ ప్రజలకు తెలుసంటున్నారు. బీజేపీ- బీఆర్ఎస్‌ ఎన్ని ఎత్తులు పొత్తులు వేసినా.. వందకు వందశాతం కాంగ్రెస్ ని గెలిపించబోతున్నరని.. ఈ సంకల్ప యాత్రలన్నీ ఖాయంగా సంతకు పోతాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: