వైసీపీ అటాక్స్‌: నిన్న ఆంధ్రజ్యోతి.. ఇవాళ ఈనాడు?

Chakravarthi Kalyan
కర్నూలులో ఈనాడు ఆఫీసుపై జరిగిన దాడిని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే కాటసాని అనుచరులు కర్నూలు ఆఫీసుపై దాడి చేయడాన్ని నారా లోకేశ్‌ ఖండించారు. తమ ఎమ్మెల్యేపై తప్పుడు వార్తలు రాశారంటూ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు దాడికి దిగారు. ఈనాడు ఆఫీసుపై కాటసాని అనుచరులు రాళ్లు విసిరారు. దీనిపై స్పందించిన లోకేశ్.. సైకో జ‌గ‌న్ కాల‌కేయ సైన్యం మీడియా ల‌క్ష్యంగా దాడుల‌కు తెగ‌బ‌డుతోందని ధ్వజమెత్తారు.
ఇటీవల అనంత‌పురం స‌భ‌లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫ‌ర్‌ని అంతం చేయ‌డానికి ప్రయ‌త్నిచారని నారా లోకేశ్‌ గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా ఈనాడు క‌ర్నూలు కార్యాల‌యంపైకి పాణ్యం ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డి వైకాపా రౌడీమూక‌ల్ని వ‌దిలాడని నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిష్పాక్షిక  స‌మాచారం అందించే ఈనాడు వంటి అగ్రశ్రేణి దిన‌ప‌త్రిక కార్యాల‌యంపై వైకాపా దాడుల‌కు తెగ‌బ‌డ‌డం రాష్ట్రంలో ఆట‌విక పాల‌న‌కి ప‌రాకాష్టని నారా లోకేశ్‌  దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యానికి మూల‌ స్తంభంలాంటి మీడియాపై సైకో జ‌గ‌న్ ఫ్యాక్షన్ దాడులు అంటూ నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: