ఇవాళ ఏపీ, తెలంగాణలో మోడీ సందడి..?

Chakravarthi Kalyan
ఇవాళ దేశం వ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో మోదీ సందడి చేయనున్నారు. అనేక ఉన్నత విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు సంస్థలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. దేశంలో కొత్తగా మూడు ఐఐఎం క్యాంపస్‌లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఐఐఎం జమ్ము, బోధ్‌ గయా, విశాఖపట్నం క్యాంపస్‌లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. వీటితో పాటు ఐఐటీ బిలాయ్‌, ఐఐటీ తిరుపతి, ఐఐటీ జమ్ము, ట్రిపుల్‌ ఐటీ కాంచీపురం శాశ్వత భవనాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు.
కాన్పూరులో నిర్మించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ స్కిల్స్‌-ఐఐఎస్‌ను  కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 20 కేంద్రీయ విద్యాలయాలు, మరో 13 నవోదయ విద్యాలయ భవనాలను కూడా ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంంబధించి 250 ఎకరాల్లో ఐఐఎం శాశ్వత క్యాంపస్ ను సిద్ధం చేశారు. కర్నూలులో నిర్మించిన ట్రిపుల్ ఐటీని కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: