జగన్‌తో పోటీ: ఆ మాట చంద్రబాబు చెప్పగలడా?

Chakravarthi Kalyan
ఇటీవల చంద్రబాబు జగన్‌కు సవాల్ విసిరారు. జగన్ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దం అంటున్నారు. అయితే.. దీన్ని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఏం చెప్పిందని, నోటికి వచ్చినట్లు తిట్టడం తప్ప ప్రతిపక్షం చేసింది ఏమీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతాని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుతున్నామన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎం వైయ‌స్ జగన్‌ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.
తన పాలనలో ఇది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా  అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అడిగారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతంపైగా   తాము అమలు చేశామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: