గుడ్‌న్యూస్‌.. ఇవాళ వాళ్ల ఖాతాల్లోకి జగన్ డబ్బు?

Chakravarthi Kalyan
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద అర్హులైన వధూవరులకు రూ. 78.53 కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ఇవాళ వారి ఖాతాలకు జమ చేయనున్నారు. అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఈ మొత్తాన్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికం తో కలిపి ఇప్పటి వరకూ 56,194 మంది లబ్ది దారులకు రూ. 427.27 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: