మోదీని కలవరపెడుతున్న ఒకే పెద్ద సమస్య?

Chakravarthi Kalyan
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు నల్లేరుపై నడకగానే అంతా భావించారు. కానీ.. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సమస్య మోడీ టీమ్‌ను కాస్త కలవర పరుస్తోంది. అదే రైతుల ఆందోళన. పంటకు కనీస మద్దతు ధర కోరుతూ దిల్లీ చలో చేపట్టిన రైతులు ఇప్పుడు మోడీ సర్కారుకు కొరకరాని కొయ్యగా మారుతున్ననారు. అందుకే సాధ్యమైనంత వరకూ వారితో చర్చలకు కేంద్రం మొగ్గుచూపుతోంది. కానీ ఈ చర్చలు కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు.
తాజాగా మరోసారి కేంద్ర ప్రతిపాదనలను రైతులు తిరస్కరించినట్లు ప్రకటించారు. మంత్రులతో చర్చించన రైతు సంఘం నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్వాల్‌.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మాతో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారన్న రైతు సంఘం నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్వాల్‌.. పప్పు దినుసులపై ఎమ్‌ఎస్‌పీ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రులు చెప్పారన్నారు. వాస్తవానికి రూ.1.75 లక్షల కోట్లు వరకు ఖర్చు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారని ఆయన అన్నారు. అందుకే కేంద్రం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: