కులాల లెక్కలు తీస్తున్న రేవంత్‌.. శభాష్‌ బిడ్డా?

Chakravarthi Kalyan
తెలంగాణలో కుల గణన లెక్కలు తీసేందుకు సిద్ధమైన సీఎం రేవంత్‌ రెడ్డిని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అభినందించారు.  రాష్ట్రంలో బలహీన వర్గాలు, తమ జీవితాల్లో సమున్నతంగా, ఎదిగే "లక్ష్య సాధన"కు ఇది మంచి శుభారంభంగా నిలుస్తుందని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం అభిప్రాయపడ్డారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కలిసి శాలువతో సన్మానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కూడా పుష్పగుచ్చం అందచేసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృతజ్ఞతలు చెప్పారు.

బీసీలు దశాబ్ధాలుగా ఇంటింటికి వెళ్లి తమ లెక్కలు తీసి జనాభా దామాషా మేరకు చట్టసభల్లో తమ వాటా కల్పించాలని చేస్తున్న డిమాండ్ ఇన్నాళ్ళకు నేరవేరబోతుందని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం అన్నారు. ఇది ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో చేపట్టబోయే ఈ ”కుల సర్వే” త్వరితగతిన పూర్తి కావాలి... ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం సూచించారు. ఆ దిశగా బీసీల చిరకాల డిమాండ్లు అన్నీ  క్రమంగా నెరవేరాలని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: