బయోమెట్రిక్.. రూ.28 కోట్లు బూడిదలోనే?

Chakravarthi Kalyan
తెలంగాణ పాఠశాలల్లో బయో మెట్రిక్‌ వ్యవస్థను ఆలోచన లేకుండా ఏర్పాటు చేశారని కాగ్‌ తెలిపింది. సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయకుండా, ఆధార్‌ డేటాను అంచనా వేయకుండా పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను అస్తవ్యస్థ ధోరణిలో చేపట్టినట్లు కాగ్‌ ఆక్షేపించింది. దీనివల్ల 28 కోట్ల వ్యయంతో 12 జిల్లాల్లో చేసిన వ్యయం వ్యర్థమయిందని కాగ్ తెలిపింది.
సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారానే ప్రకటనలు ఇవ్వాలన్న ఉత్తర్వులను పర్యాటక శాఖ ఉల్లఘించిందని కాగ్ తెలిపింది. 2015 -20 మధ్యకాలంలో 20 కోట్ల వ్యయంతో పర్యాటక శాఖ ప్రకటనలు ఇచ్చింది. దాదాపు 10 కోట్లు ఒకే ఏజెన్సీకి ఇచ్చినట్లు కాగ్ గుర్తించింది. ఏజెన్సీ చేసిన క్లైయిమ్‌ల వాస్తవాలు నిర్ధారించుకోకపోవడంతో కోటి 84 లక్షల మోసపూరిత చెల్లింపులు జరిగినట్లు కాగ్‌ గుర్తించింది. బాసర వద్ద సౌండ్ అండ్‌ లైట్‌ షో అభివృద్ధికి సంబంధించి పరికరాలు సేకరించి సివిల్ పనులు చేపట్టలేదని కాగ్ చెప్పింది. దీనివల్ల  ఫలితంగా పరికరాల కోసం చేసిన 73 లక్షల వ్యయం నిరర్థకంగా మారిందని కాగ్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: