ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. జగన్‌, కేసీఆర్‌ డ్రామా?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ను మరో రెండేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు వైసీపీ నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి చెప్పడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. మరో రెండు సంవత్సరాలు కావాల్సి ఉందని పేర్కొనడం అనడం అవివేకం, హాస్యాస్పదమని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఖండించారు. వైపీ సుబ్బారెడ్డి గొంతెమ్మ కోరిక – పిచ్చి తుగ్లక్ వ్యవహారంగా ఉందని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఆరోపించారు.

ఎన్నికల ముందు జగన్, కేసీఆర్ కలిసి ఇరు ప్రాంతాల ప్రజలను తప్పుద్రోవ పట్టించి పబ్బం గడుపుకోవడానికే ఈ ప్రకటన చేశారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నటికీ ఒప్పుకోదని జి.నిరంజన్‌ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున విడిపోయిన ఆంధ్ర ప్రాంతానికి రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా హైదరాబాద్‌ను 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిగా ఉండటానికి వీలు కల్పిస్తూ విభజన చట్టంలో పొందుపరిచారని జి.నిరంజన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: